Mana Enadu: గాడ్ ఆఫ్ మాసెస్, యాక్షన్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boya PatiSreenu) కాంబో గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్‌కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. వీరి కాంబోలో చివరగా వచ్చిన అఖండ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పటికే బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో మూడు మూవీలు వచ్చాయి. ఆ మూడూ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఆఖండ(Akhanda), సింహ(Simha), లెజెండ్(Legend) ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేసింది ఈ ద్వయం. అందుకే ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్(Fans) ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొత్త మూవీలో బాలయ్య గెటప్ ఎలా ఉంటుంది? బోయపాటి అఖండ-2ను చూపిస్తారా? అని తెలియాల్సి ఉంది.
ఆ మూడు సినిమాలు బంపర్ హిట్
తాజాగా ఈ కొత్త మూవీ పూజా కార్యక్రమం ఈరోజు రామా నాయుడు స్టూడియోలో జరగనున్నట్లు టీటౌన్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రామ్ అచంట(RaamAchanta), గోపీ అచంట 14 రీల్స్ ప్లస్(14ReelsPlus) బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారట. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి బాలయ్య చిన్న కూతురు ఎం.తేజస్విని నందమూరి(MTejeswiniNandamuri) సమర్పకురాలుగా వ్యవహరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్ సంగీతం అందించనున్నారు. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు మూడు సినిమాలు సింహ, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. తాజాగా 14 ప్లస్ రీల్స్ ఓ ట్వీట్ చేసింది. బాలయ్య-బోయపాటి కాంబోలో షూటింగ్(Shooting) త్వరలో ప్రారంభం కానుందని ట్వీట్ చేసింది.
https://twitter.com/14ReelsPlus/status/1846379347814342807
ఆ పాయింట్‌ను కొనసాగించేనా..
అయితే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ వచ్చిన మూడు సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న నాలుగో మూవీ.. ‘అఖండ’ కథకు ఇది కొనసాగింపు. అయితే బోయపాటి మాత్రం ఈ సినిమాకు ఓ కొత్త టైటిల్ ప్రకటించ బోతున్నాడు. రేపు HYDలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే మోషన్ పోస్టర్ కూడా విడుదల చేస్తారు. ఈ చిత్రానికి ‘తాండవం(Thaandavam)’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ‘అఖండ’లో మాస్, యాక్షన్, హీరోయిజం ఇవన్నీ బాగా పండాయి. దానికి తోడు హిందుత్వం అనే ఎలిమెంట్ కూడా తోడైంది. దేవాలయాల పరిరక్షణ, వాటి విశిష్టత గురించి ‘అఖండ’లో చెప్పారు. ఇప్పుడు ఆ పాయింట్‌తో ఈ సినిమా స్టోరీ ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.