
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) జంటగా వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ కొట్టింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మ్యూజిక్ స్టార్ తమన్(Thaman) సంగీతం అందించాడు. శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలయ్య కెరీర్‌లోనే ఇంతపెద్ద సక్సెస్ అయిన చిత్రం డాకు మహారాజర్.
శేఖర్ మాస్టర్ మీద నెటిజన్ల ఫైర్.. కానీ!
అయితే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)తో బాలయ్య వేసిన స్టెప్పులకు ఫుల్ క్రేజ్ వచ్చింది. దబిది దిబిడి అనే సాంగ్(Dabidi Dabidi song)కు ఊరమాస్ స్టెప్పులతో వీరిద్దరూ అదరగొట్టేశారు. ఈ పాటు రిలీజ్ అయ్యాక.. చాలా మంది ఈ పాటకు కొరియో గ్రాఫర్‌గా చేసిన శేఖర్ మాస్టర్ మీద నెటిజన్లు మండిపడ్డారు. కానీ ఆ తర్వాత సినిమా చూశాక వారంతా సైలంట్ అయ్యారు. అయితే ఈ బాలయ్య పాటకు జపనీయులు సందడి చేస్తున్నారు.
View this post on Instagram
బాలయ్య అంటే ఆమాత్రం ఉంటుంది
‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ సాంగ్ జపాన్ అభిమానుల(Japan Fans)ను తెగ ఆకట్టుకుంది. దీంతో అక్కడి ఓ డాన్స్ టీమ్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఇక ‘దబిడి దిబిడి ప్రపంచవ్యాప్తమైంది’ అని ఆమె ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. దీనికి ‘‘జై బాలయ్య.. బాలయ్య అంటే ఆమాత్రం ఉంటుంది’’ అని బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.