సంక్రాంతి(Sankranti) వచ్చిందంటే చాలు.. కోడి పందేలు.. ఎద్దుల బండ లాగుడు పోటీలు.. అంతకు మించి పతంగులు(Kites) ఎగురవేయడం.. ఎక్కడెక్కడున్నా వారంతా తమతమ సొంతూళ్లకు చేరుకొని ఇంటిళ్లిపాది ఆనందంగా జరుపుకునే ఫెస్టివల్ సంక్రాంతి. ఒక్కమాటలో చెప్పాలంటే APలో కోడిపందాలు ఆడటం, TGలో గాలిపటాలు(Kites) ఎగరవేయడం దీని ప్రత్యేకత. రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలను ప్రతిబింబించే ప్రతీకలుగా వీటిని భావిస్తారు. తెలంగాణలో పతంగుల వేడుకకు HYD శతాబ్దాలుగా కేంద్రం. కుతుబ్‌షాహీల కాలం నుంచి ఈ ప్రాంతంలో గాలిపటాలకు ఆదరణ ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడి సంస్కృతిలో పతంగులు ఎలా భాగం అయ్యాయి? సంక్రాంతి పండగకు పతంగులు ఎగురవేయడానికి ఏమైనా సంబంధం ఉందా? అనేవి తెలుసుకుందామా?
కుతుబ్ షాహీల కాలం నుంచే..
కుతుబ్ షాహీల(Qutub Shahi) పాలనలో హేమంత రుతువులో కాగితాలతో తయారుచేసిన పతంగులను, మూలికలు రుద్దిన దారాల సహాయంతో ఎగురవేసేవారు. ఆ తర్వాత అసఫ్ జాహీ(Asaf Jahi)ల పాలనలోనూ ఇది కొనసాగింది. ఆరవ నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ మైదానాల్లో పెద్ద ఎత్తున పతంగుల పోటీలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. 1990 వరకు హైదరాబాద్ పాతబస్తీ(Oldc City)లో పతంగుల పోటీలు జరిగేవి” అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం(Telangana History Team) పేర్కొంది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని కొన్ని ఇరుకైన వీధులు పతంగుల తయారీ కేంద్రాలు. పతంగుల తయారీ ఇక్కడ కుటీర పరిశ్రమ. హైదరాబాద్ కాలనీల్లో మతాలకతీతంగా కమిటీలు ఏర్పడి పోటీలు నిర్వహించేవారట. ఇక ఈసారి జనవరి 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్లో ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది.
🌏✨ Hyderabad’s Sky Meets Sweet Delight! ✨🌏
Get ready to witness a kaleidoscope of colors and flavors at the International Kite & Sweet Festival in Hyderabad! 🎉 From breathtaking kites soaring high above the city to mouthwatering sweets from around the globe, this festival is… pic.twitter.com/T4I61FehEl— Telangana Tourism (@TravelTelangana) January 11, 2025
ప్రత్యేక ఆకర్షణగా గాలిపటాల మ్యూజియం
ఇక ఇండియా(India)లో గాలిపటాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) ప్రసిద్ది చెందింది. ఇక్కడి గాలిపటాల మ్యూజియం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారి 1989లో అహ్మదాబాద్ వేదికగా అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు(International Kite Festivals) జరిగాయి. తెలంగాణలో 2016 నుంచి అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మొదట్లో అగాఖాన్ అకాడమీ(Aga Khan Academy)లో నిర్వహించిన ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground)లో జరుగుతున్నాయి. గతంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కంబోడియా, మలేషియా, వియత్నాం, ఇటలీ, దక్షిణఆఫ్రికా, శ్రీలంక దేశాలనుంచి ఔత్సాహులు ఇక్కడి పోటీల్లో పాల్గొన్నారు.






