Pushpa-2: బొమ్మ దద్దరిల్లాల్సిందే.. మరో 50 రోజుల్లో ‘పుష్పరాజ్’ వచ్చేస్తున్నాడు!

Mana Enadu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప2(Pushpa-2)’. సుకుమార్(Sukumar) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్(Blockbuster) హిట్ కావడంతో సెకండ్ పార్ట్‌పై హైప్ మరింత పెరిగిపోయింది. అందుకు అనుగుణంగానే దర్శకుడు ఈ సీక్వెల్ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్(Positive Response) వచ్చింది.

 అల్లు అర్జున్ స్టైల్ ఓ రేంజ్‌లో ఉంది

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న(DEC 6th) గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా ఇంకా రిలీజ్ కు 50 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్‌(New Poster)ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో అల్లు అర్జున్ స్టైల్ ఓ రేంజ్‌లో ఉంది. కుర్చీపై కూర్చుని చూస్తున్న అతడి లుక్ చూసి ఫ్యాన్స్(Fans) ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

https://twitter.com/MythriOfficial/status/1846787419196272717

రిలీజ్‌కు ముందే రూ.900 కోట్ల బిజినెస్

ఇదిలా ఉండగా ‘పుష్ప-2’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌(Police Officer)గా బ్రహ్మాజీ నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, షూటింగ్ పూర్తయిందంటూ ఆయన కొన్ని ఫొటోల(Photos)ను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇందులో ఫహాద్ ఫాజిల్, సుకుమార్, అనసూయ, సునీల్ ఉన్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ.900 కోట్ల బిజినెస్(Business) చేసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ & శాటిలైట్ రైట్స్‌(Digital & Satellite Rights)ను ఆల్‌టైమ్ రికార్డు ధరకు విక్రయించినట్లు టాక్. థియేట్రికల్ రైట్సే రూ.650కి కోట్ చేశారని సమాచారం.

 

Share post:

లేటెస్ట్