Mana Enadu : సాధారణంగా ఎక్కువ శాతం మహిళలు తమ సమయాన్ని వంట గదిలోనే కేటాయిస్తుంటారు. గంటలు గంటలు పని చేసినా.. కిచెన్ లో పని ఓ పట్టాన పూర్తి కాదు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి రావడం.. సరైన వస్తువులు లేకపోవడం కూడా దీనికి ఓ కారణం. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు గనుక మీ వంటగదిలో ఉన్నట్లయితే మీ పని చాలా సులభంగా పూర్తవ్వడంతో పాటు మీకు చాలా సమయం ఆదా అవుతుంది. మరి వంటింట్లో ఉపయోగపడే ఆ కిచెన్ టూల్స్(Kitchen Tools) ఏంటో తెలుసుకుందామా..?
ఈ కిచెన్ టూల్స్ మీ వద్ద ఉన్నాయా?
- వంట చేయడం కంటే కూరగాయలు, ఉల్లిపాయలు కట్ చేయడానికే చాలా సమయం పడుతుంది. అదే మీ వద్ద ‘వెజిటబుల్ చాపర్ (Vegetable Chopper)’ ఉంటే ఈజీగా కూరగాయలు తరగొచ్చు.
- కిచెన్లో కొలతల స్పూన్లు, మిక్సింగ్ బౌల్స్(Mixing Bowls)ని అందుబాటులో ఉంటే అవసరమున్నప్పుడు వెంటనే వాడుకోవచ్చు.
- ఉడికించిన కాయగూరలు/పాస్తా/నూడుల్స్ వంటివి వడకట్టడానికి, చింతపండు రసం నుంచి గుజ్జును వేరు చేయడానికి చిన్న రంధ్రాలున్న ఓ జల్లెడ లాంటి బౌల్ ఉంటే ఆ పని ఈజీగా అవుతుంది.
- వాడుతున్న కొద్దీ వంటింట్లోని కత్తులు పదును కోల్పోతాయి. ఇంట్లోనే ఓ ‘నైఫ్ షార్ప్‌నర్ (Knife Sharpener)’ ఉంటే ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు.
- వంటింట్లో పదార్థాలు అమర్చిన కవర్లను ప్యాక్ చేయడానికి లేదా సీల్ చేయడానికి రబ్బర్లను వాడుతుంటారు. లేదా వాటినే ముడి వేస్తుంటారు. కొన్నిసార్లు అవి లీక్ అవ్వొచ్చు. అందుకే వాటికి బదులుగా కొన్ని సీలింగ్ క్లిప్స్ (Sealing Clips)ని దగ్గరుంచుకోవాలి.
- ఏవైనా సీల్ చేసిన మూతలు ఓపెన్ చేయాలంటే కాస్త కష్టపడాల్సిందే. అదే మీ వద్ద క్యాన్ ఓపెనర్ (Can Opener) ఉంటే పని ఈజీ అవుతుంది.