
టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబోలో వస్తున్న SSMB29 సినిమా గురించే చర్చ. SSMB29 లేటెస్ట్ అప్డేట్ ఇదే.. SSMB29 ఫొటోలు లీక్.. SSMB29 షూటింగు కోసం ఒడిశాకు మహేశ్. SSMB29లో ఫారిన్ నటులు.. SSMB29లో గ్లోబల్ స్టార్ అంటూ రకరకాల టైటిళ్లతో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మొత్తం ఈ సినిమా ట్రెండింగ్ లో నడుస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి జక్కన్న ఒక్క అధికారిక అప్డేట్ ఇవ్వలేదు.
గుప్తనిధుల కోసం అడవులకు
అప్డేట్ ఇవ్వకపోగా ఈ మూవీ సెట్ నుంచి ఫొటోలు లీక్ కావడంతో సెట్ లో సెక్యూరిటీ మరింత టైట్ చేశాడట. అయితే ఇప్పటి వరకు లీక్ అయిన ఫొటోలు, వీడియోల ఆధారంగా SSMB29 మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పుడు ఓ కథ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. గుప్తనిధుల కోసం ఈ సినిమా విలన్ మహేశ్ బాబును అడవులకు పంపిస్తాడని.. అందుకే విలన్ ముందు బాబు అలా మోకరిల్లాడని లీకైన ఫొటోల ఆధారంగా కథను క్రియేట్ చేశారు కొందరు నెటిజన్లు.
ఫ్లాష్ బ్యాక్ లో అసలైన కథ
మరోవైపు అసలు కథ కాశీ నుంచి మొదలై అడవులకు చేరుకుంటుందని మరికొందరు అంటున్నారు. హైదరాబాద్ లో కాశీ సెట్ కు సంబంధించిన ఫొటోలు లీక్ కావడంతో వాటి నుంచి మరో కథ పుట్టించారు. అక్కడే కథకు మూలం ఉంటుందట. అయితే కాశీ నుంచి మహేశ్ అడవులకు ఎందుకు వెళ్డాడనేది అసలు కథ అట. అసలైన స్టోరీని జక్కన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తాడట.
హనుమంతుడి స్ఫూర్తితో మహేశ్ బాబు పాత్ర
అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్నారట రచయిత విజయేంద్రప్రసాద్. ఆంజనేయస్వామి అడవులు, సముద్రాలు దాటుకుంటూ సీతమ్మ జాడ కోసం ఎలా వెళ్లారో.. ఈ కథలో మహేశ్ కూడా తానిచ్చిన మాటకు కట్టుబడి అడవుల బాట పడతారని టాక్ వినిపిస్తోంది. హనుమంతుడి బలం.. మాట కోసం కట్టుబడే వాయుపుత్రుడి నైజం ఈ చిత్రంలో మహేశ్ బాబులో కనిపిస్తాయట. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆ తర్వాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకుంటుందట.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…