పాన్ ఇండియా హీరోయిన్ సుహాసిని చెల్లెల్లు అని మీకు తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు..!

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి సుహాసిని(Suhasini) గురించి చెప్పనవసరం లేదు. ఆమె న‌టించిన సూప‌ర్‌ హిట్ చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె, ఒక్క తెలుగులోనే 50కి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే తమిళ, మలయాళ భాషల్లోనూ మంచి గుర్తింపు పొందారు.

నటిగా మాత్రమే కాదు, సుహాసిని దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో ముఖ్యమైన సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నాన్ని వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్‌గా నటించడాన్ని తగ్గించిన ఆమె, వెండితెరపై వినూత్న పాత్రలతో తిరిగి కనిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే.. సుహాసినికి చెల్లెలు ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతున్న శ్రుతి హాసన్! అవును, మీరు చదివింది నిజమే. సుహాసిని(Suhasini)కి శ్రుతి(shruti haasan) హాసన్ చెల్లెలే. సుహాసిని తండ్రికి కమల్ హాసన్ సొంత అన్న. అంటే శ్రుతి హాసన్ సుహాసిని అక్కాచెల్లెళ్లు అన్నమాట. ఈ ఆసక్తికర విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు.

శ్రుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. ‘గబ్బర్ సింగ్’, ‘శ్రీమంతుడు’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ‘సలార్’ చిత్రం ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న శ్రుతి ప్రస్తుతం ‘సలార్ 2’తో పాటు మరికొన్ని భారీ సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *