కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్లో 3 మావోల మృతి

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం (మార్చి 25) దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాల(Security forces)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతం(Forest)లో నక్సల్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్(Combing) నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

29 Maoists killed in major anti-Naxal operation in Chhattisgarh's Kanker | Latest News India - Hindustan Times

భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం

కాగా ఘటనాస్థలంలో మూడు డెడ్ బాడీలతోపాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల(Weapons and explosives)ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్(Operation) కొనసాగుతోంది. కాగా ఈనెల 20న భారీ ఎన్ కౌంటర్లు(Encounters) జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్ కాంకెర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోటు చేసుకున్న పలు ఎన్ కౌంటర్లలో దాదాపు 90 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం.

Related Posts

Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్‌(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు మృతి

తెలంగాణలోని యాదాద్రి జిల్లా(Yadadri District) చౌటుప్పల్‌ మండలం ఖైతాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కార్పియో కారు అదుపుతప్పి లారీ(Lorry)ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఇద్దరూ ఏపీ(Andhra pradesh)కి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *