ఆ ఫ్యామిలీలోకి త్వరలో కొత్త వ్యక్తి.. తండ్రి కాబోతున్న స్టార్ హీరో?

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా(Social Media)లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం సినీ పరిశ్రమతోపాటు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా, తన భార్య మిహీకా బజాజ్‌(Miheeka Bajaj)తో కలిసి ఈ ఆనందకరమైన దశలోకి అడుగుపెడుతున్నారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కాగా 2020లో వీరిద్దరూ వివాహబంధం(Marriage)లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి కుటుంబంలో కొత్త సభ్యుడు రాబోతున్నాడనే వార్త అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. రానా దగ్గుబాటి, బాహుబలి(Bahubali) చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ తన నటనా ప్రతిభను చాటాడు.

Rana Daggubati and Miheeka Bajaj's wedding video is straight out of fairy  tale. Watch - India Today

‘జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్’ అనే క్యాప్షన్

అయితే ఆ మ‌ధ్య మిహిక ప్ర‌ెగ్నెంట్(pregnant) అని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్రమంలో మరోమారు ఈ వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మిహిక తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టమక్ మీద హ్యాండ్ వేసి ఫొటోస్‌(Photos)కి స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ పిక్‌కు.. ‘జస్ట్ ఫెల్ట్ లైక్ ఇట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మిహిక ప్రెగ్నెంట్ అని, రానా తండ్రి కాబోతున్నాడని ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి దీనిపై ఈ జంట స్పందించాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Miheeka Daggubati (@miheeka)

రానా-మిహీక దంపతులకు అభినందనల వెల్లువ

అంతేకాదు ‘లీడర్(Leader)’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘రుద్రమదేవి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించాడు. నటుడిగా, నిర్మాతగా, విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా రానా బహుముఖ ప్రతిభావంతుడుగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రానా ‘హిరణ్య కశ్యప’, ‘రాక్షస రాజా’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో ‘ది రానా కనెక్షన్(The Rana Connection)’ అనే టాక్ షో ద్వారా అమెజాన్ ప్రైమ్‌(Amazon Prime)లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ టాక్ షోలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కాగా దగ్గుబాటి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రానుండటంతో రానా-మిహీక దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Rana Daggubati announces his talk show 'The Rana Connection'

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *