Guntur Karam: మాస్ స్టెప్పులతో అదరగొట్టేసిన మాహేష్.. ‘గుంటూరు కారం’ సెట్స్ నుంచి డాన్స్ వీడియో లీక్..

ఇప్పటికే విడుదలై పోస్టర్స్, పాటలు, టీజర్‏లో గుంటూరు కారం చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా చూస్తోన్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీపై ఇప్పటికే అభిమానులలో మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా ఇందులో మహేష్ మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలై పోస్టర్స్, పాటలు, టీజర్‏లో గుంటూరు కారం చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో రాబోతున్న మూవీ కావడంతో ఈ సినిమా కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. డిసెంబర్ 20 వరకు అక్కడే చిత్రీకరణ జరగనుంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి డాన్స్ వీడియో లీక్ అయ్యింది. అందులో మహేష్ బాబు డాన్స్ చేస్తూ కనిపించారు. నడిరోడ్డు పై డాన్స్ అసిస్టెంట్స్ స్టెప్పులు వేసి చూపిస్తుంటే వాటిని మహేష్ బాబు ప్రాక్టీస్ అవుతూ కనిపిస్తున్నారు. మాస్ బీట్‏కు అదరగొట్టేస్తున్నారు మహేష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఇప్పటికే విడుదలైన దమ్ మసాలా సాంగ్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపించనున్నారు మహేష్. అంతేకాకుండా.. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై హైప్ ఎక్కువగానే ఉంది. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించబోయే ప్రాజెక్టు స్టార్ట్ కానుంది.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

వాలెంటైన్స్ డే స్పెషల్.. ప్రేమకు తెలుగు సినిమా నిర్వచనం

ప్రేమ (Love).. ఈ రెండక్షరాల ఎమోషన్ ప్రతి మనిషి జీవితంలో ఓ అందమైన మధురానుభూతి. ప్రేమకు ఎన్నో అర్థాలున్నాయి. ప్రేమ అంటే ఏంటి అంటే దానికి సరైన డెఫినేషన్ లేదు. మనుషుల మనసును బట్టి ప్రేమకు అర్థం మారిపోతుంది. కొందరు తమకిష్టమైన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *