Mr Idiot Teaser : మాధవ్ “మిస్టర్ ఇడియ‌ట్‌” టీజర్ రిలీజ్

Mr Idiot : మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌”. పెళ్లి సందడి ఫేమ్‌ దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో జెజే ఆర్ రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ ర‌వితేజ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేశారు.

ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య ( సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ల‌ను ఎంతో అద్భుతం గీస్తుంటుంది. కాలేజ్‌లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి స‌మ‌యంలో హీరో (మాధ‌వ్) కాలేజ్‌లోకి అడుగుపెడ‌తాడు. సత్యను గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్‌ను హీరో గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.
నటీనటులు – మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ
సంగీతం అనూప్ రూబెన్స్,సినిమాటోగ్రఫీ – రామ్,
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె,ఎడిటింగ్ – విప్లవ్
పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – జేజేఆర్ రవిచంద్,రచన, దర్శకత్వం – గౌరి రోణంకి

 

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Kantha: ‘కాంత’ పోస్టర్ రివిల్.. ఆకట్టుకుంటున్న భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్

తెలుగులో మహానటి, సీతారామం, లక్మీ భాస్కర్ వంటి మూవీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan). బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో అతడికి టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్ బేస్ దక్కింది. దీంతో తెలుగులో వరుసబెట్టి సినిమాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *