Pushpa 2 | మాస్‌ జాతరకు సిద్ధం.. ఈ నెల 8న పుష్ప-2 టీజర్‌

అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2’ అప్‌డేట్‌ వెలువడింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భంగా ఈ నెల 8న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదిక ద్వారా ఓ పోస్టర్‌ను పంచుకుంది. దీనికి ‘పుష్ప మాస్‌ జాతర కోసం వేచి చూడండి’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

తాజా అప్‌డేట్‌తో బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ (ది రూల్‌) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలేర్పడ్డాయి. తొలి భాగానికి వచ్చిన అపూర్వ ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌ మేకింగ్‌పై దర్శకుడు సుకుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ సోషల్‌మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లి గెటప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Share post:

లేటెస్ట్