మన ఈనాడు:
నర్సాపూర్ అభ్యర్థి ఎంపికపై గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌లో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులు ప్రకటించారు. కానీ కొన్ని సీట్లను పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ సీట్లపైనే అసలు సిసలైన
హైదరాబాద్: నర్సాపూర్ అభ్యర్థి ఎంపికపై గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌లో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులు ప్రకటించారు. కానీ కొన్ని సీట్లను పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ సీట్లపైనే అసలు సిసలైన హైడ్రామా నడిచింది. మొన్నటిదాకా జనగామ సీటు ఎవరికి ఇస్తారంటూ చర్చ నడిచింది. చివరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. పల్లా ఇప్పటికే బీఫామ్ అందుకున్నారు. జనగామ సీటులాగానే నర్సాపూర్ అభ్యర్థి ఎంపికపై కూడా తీవ్ర ఉత్కంఠ సాగింది. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి ఇస్తారా? లేదంటే సునీత లక్ష్మారెడ్డికి ఇస్తారా? అన్న ఆసక్తి చోటుచేసుకుంది. తీవ్ర కసరత్తు తర్వాత నర్సాపూర్ సీటుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందచేశారు. మదన్ రెడ్డికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొద్ది రోజులుగా నర్సాపూర్ టికెట్‌పై సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.