భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి ‘మే’ నెల టికెట్లు విడుదల

తిరుమల భక్తులకు శుభవార్త. మే నెల కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుని చెల్లింపులు మాత్రం 22 వరకు చేయవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

లక్కీ డిప్ ద్వారా టికెట్లు

ఆ తర్వాత లక్కీ డిప్ ద్వారా టికెట్లు మంజూరవుతాయని వెల్లడించారు. తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు ఈ నెల 21 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయని టీటీడీ వెల్లడించింది. అదే రోజు (ఫిబ్రవరి 21) మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్స్ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

24న ప్రత్యేక దర్శనం టికెట్లు

ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు.. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని వెల్లడించారు. మే నెల వివిధ సేవల టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttddevasthanams.ap.gov.in ద్వారా తీసుకోవచ్చు.

తిరుమల మే నెల కోటా ముఖ్యమైన తేదీలు

  1. ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు
  2. 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ల బుకింగ్
  3. 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు చెల్లింపులు, లక్కీ డిప్
  4. 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపకాలంకార సేవ టికెట్లు
  5. 21వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు వర్సువల్ సేవలు, దర్శనం స్లాట్స్ బుకింగ్
  6. 22వ తేదీ ఉదయం 10 గంటలు అంగ ప్రదక్షిణం టోకెన్లు
  7. 22వ తేదీ ఉదయం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
  8. 24వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు వసతి గదుల బుకింగ్
  9. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10  గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *