Udayanidhi Stalin : తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?

Mana Enadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Staling) ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అప్పగిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై ఆ పార్టీ నేతలు కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది.

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి (Udhayanidhi stalin) దాదాపు ఖారారైనట్లు సమాచారం. రానున్న 24 గంటల్లో ఆయన కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కుమారుడికి కొత్త బాధ్యతలు అప్పగించడంపై కొంతకాలం క్రితం స్టాలిన్‌ మాట్లాడిన విషయం తెలిసిందే. ఉదయనిధి డిప్యూటీ సీఎం కావడానికి ఇంకా సమయం ఉందని ఆ సమయంలో స్టాలిన్ తెలిపారు. పార్టీ నుంచి కూడా ఈ డిమాండ్‌ పెరుగుతోందని వెల్లడించారు.

24 గంటల్లో పదవీ బాధ్యతలు

స్టాలిన్ వ్యాఖ్యలతో ఉదయనిధికి కొత్త పదవి (TamilNadu Deputy CM) అప్పగించడంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. దీనిపై పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. 24 గంటల్లో దీనిపై స్పష్టత రానుంది. డిప్యూటీ సీఎంగా ఉదయనిధిని దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి (Udhayanidhi) కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా.. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ సెక్రటరీ ఉదయనిధి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Share post:

లేటెస్ట్