Turmeric Board: ఏళ్లనాటి కల సాకారం.. నేడే పసుపు బోర్డు ప్రారంభం

తెలంగాణ పసుపు రైతుల కల సాకారం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్‌(Nizamabad)లో ఇవాళ పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేయనుంది. సంక్రాంతి(Sankranti) పర్వదినాన పసుపు బోర్డును మంగళవారం కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్(Piyush Goyal) వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే జాతీయ బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి(Palle Gangareddy)ని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఈ పదవిలో 3ఏళ్ల పాటు ఉండనున్నారు. దాదాపు 15 ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకు రైతులు డిమాండ్(Farmers Demand) చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీకి ఎంపీ ధర్మపురి కృతజ్ఞతలు

కాగా, తెలంగాణ(Telangana)లోని నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. పసుపు రైతులకు గిట్టుబాటు ధర(Affordable price) కల్పించాలని రైతుల నుంచి బలమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో.. గత MP ఎన్నికలకు ముందు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. దీంతో పసుపు ధరలు, నాణ్యత సహా ఇతర అంశాలు ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. బోర్డు ఛైర్మన్ కూడా ఎంపిక కావడంతో.. త్వరలోనే మిగతా పనులు పట్టాలెక్కనున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ రైతుల దశాబ్దాల నాటి కలను నెరవేర్చిన ప్రధాని మోదీ(PM Modi)కి ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) కృతజ్ఞతలు తెలిపారు.

Farmers Celebrations Over Turmeric Board Telangana : దశాబ్దాల కల నెరవేరిన  వేళ.. పసుపు బోర్డు ప్రకటనతో రైతుల సంబురాలు

ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు

ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు. మన దగ్గర వినియోగం, ఇతర దేశాలకు ఎగుమతుల్లోనూ మనమే ముందు వరుసలో ఉన్నాం. అంతర్జాతీయ పసుపు ఉత్పత్తి ఏడాదికి దాదాపు 11 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా.. అందులో భారత్ వాటానే 78% ఉంటుంది. మన తర్వాత Chaina 8%, మయన్మార్ 4% నైజీరియా, బంగ్లాదేశ్ వంటి మిగతా దేశాలున్నాయి. ఇక TGలో 2023-24లో తెలంగాణ 0.23 లక్షల హెక్టార్లలో 1.74 లక్షల టన్నుల పసుపును రైతులు ఉత్పత్తి చేశారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్,ఆదిలాబాద్ జిల్లాల్లో పసుపు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ 4 జిల్లాల్లోనే రాష్ట్రంలోని 90శాతానికి పైగా పసుపు ఉత్పత్తి ఉంటుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *