‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4’.. సీఎం చంద్రబాబు ఎపిసోడ్‌ ప్రోమో అదిరిందిగా

Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable) ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ షో నాలుగో సీజన్‌కు ఇప్పుడు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో భాగంగా ఈ సీజన్‌లో మొదటి అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) సందడి చేశారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా (Aha) విడుదల చేసింది. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘చంద్రబాబునాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని’ అంటూ ప్రమాణం చేయించగా, ‘సమయస్ఫూర్తిగా సమాధానం’ చెబుతా అని చంద్రబాబు అనడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వారు. ‘మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది’ అంటూ చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా హోస్టు బాలకృష్ణ చంద్రబాబు నాయుడిని ఏపీ రాజకీయాలు, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అడిగారు. ముఖ్యంగా అరెస్ట్ చేస్తారని ముందే సమాచారం ఉందా..? పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో అప్పుడు ఏం మాట్లాడారు..? అని అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుండగా చంద్రబాబుతో పాటు ఆడియెన్స్ లో కొందరు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత కాస్త ఫన్ జోడిస్తూ ధోనీ, విరాట్(Virat Kohli) లలో ఎవరంటే ఇష్టమని అడగ్గా తాను విరాట్ స్టైల్ ను ఫాలో అవుతానని చెప్పారు చంద్రబాబు. ఇక ఇంట్లో భువనేశ్వరి, బ్రాహ్మణిలో ఎవరు బాస్ అని కూడా అడిగారు. ఇక ఈ ప్రోమో చివరలో తెలుగు జాతి నెం.1 ఉండాలన్నది తన ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Share post:

లేటెస్ట్