పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలోని కొన్ని వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఆయన జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ల గురించి తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవల దర్శకుడు గీత కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లిపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గీత కృష్ణ మాటల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని తనకు బంధువు అవుతుందని చెప్పారు. “నందినిది పోలవరం. మా అక్కను పోలవరానికి చెందిన ఓ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. అలా మాకు నందిని కుటుంబంతో పరిచయం ఏర్పడింది. నందిని చిన్నప్పుడే చూసాను అని తెలిపారు.
ఒకసారి నాగార్జునతో కలిసి షూటింగ్ కోసం పోలవరం వెళ్లిన సమయంలో వర్షం కారణంగా నందిని ఇంట్లో కొద్దిసేపు ఉండాల్సి వచ్చింది “అప్పుడు నందిని ఇంకా పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోలేదు. అయితే మళ్ళీ పోలవరం వెళ్లినప్పుడు నందినితో పెళ్లయిందని, ఆమె పెళ్లి ఆల్బమ్ కూడా చూపించారు. అప్పుడే నాకు అసలైన విషయం తెలిసింది,” అని వివరించారు.
పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిందట. “గ్రాండ్‌గా చేసుకోవడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే కుటుంబ సభ్యులు నందినితో కలిసి శిరిడికి వెళ్లి చాలా సాదాసీదాగా పెళ్లి జరిపించారు” అని గీత కృష్ణ చెప్పారు.
అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. కొంతకాలం తరువాత నందినికి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, తన రెండవ భార్య రేణు దేశాయ్ను ప్రేమించి ఇంట్లోనే సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు అఖిరా నందన్ మరియు కుమార్తె ఆధ్య ఉన్నారు. కానీ ఈ వివాహం కూడా నిలవకపోవడంతో వారికి విడాకులు జరిగాయి.
అంతకు తర్వాత పవన్ కళ్యాణ్ మూడవసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి రష్యాకి చెందిన అన్నా లెజ్నోవాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉన్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి విషయంలో బయటకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను గీత కృష్ణ తాజాగా బయటపెట్టిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







