శివశక్తిగా తమన్నా.. అమ్మ సెంటిమెంట్‌తో కళ్యాణ్ రామ్.. ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో సినిమాల సందడి

వేసవి వచ్చినా ఇప్పటి వరకు సరైన బొమ్మ థియేటర్లో పడలేదు. ప్రతి ఏడాది సమ్మర్ సీజన్(Summer Season 2025)లో వినోదాల విందు పంచేందుకు బడా హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ మొదలై సగం రోజులు గడిచినా ఒక్క స్టార్ హీరో మూవీ థియేటర్లోకి రాలేదు. అయితే చిన్న చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చూపుతున్నాయి. అలా ఈ వారం తమన్నా ఓదెల-2 (Odela 2), కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతితో పాటు మరికొన్ని చిత్రాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.

సమ్మర్ సందడి

ఈ వారం బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి తక్కువగా ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/O Vyjayanthi)తో పాటు శివశక్తిగా తమన్నా తన విశ్వరూపం చూపించేందుకు ఓదెల-2తో థియేటర్లోకి వచ్చేస్తోంది. ఇక ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు అక్షయ్ కుమార్ నటించిన పాపులర్ మూవీ కేసరికి సీక్వెల్ గా కేసరి చాప్టర్-2 (Kesari Chapter-2) వస్తోంది. ఈ వారం ఈ మూవీ కూడా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు ఓటీటీలో సందడి చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలివే

  1. ఓదెల-2 – ఏప్రిల్ 17
  2. అర్జున్ సన్నాఫ్ వైజయంతి – ఏప్రిల్ 18
  3. కేసరి చాప్టర్-2 –  ఏప్రిల్ 18

ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే

అమెజాన్‌ ప్రైమ్‌

  1. గాడ్‌ఫాదర్‌ ఆఫ్ హాలెం (వెబ్‌సిరీస్‌)- ఏప్రిల్ 13
  2. ఖౌఫ్‌ (హిందీ సిరీస్‌) – ఏప్రిల్‌ 18

సోనీలివ్‌

  1. చమక్‌: ది కన్‌క్లూజన్‌ (హిందీ సిరీస్)- ఏప్రిల్‌ 14

జియో హాట్‌స్టార్‌

  1. ది లాస్ట్‌ ఆఫ్‌ అజ్‌2 (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 14
  2. ది స్టోలెన్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 16

నెట్‌ఫ్లిక్స్‌

  1. ది గ్లాస్‌ డోమ్‌ (వెబ్‌సిరీస్)- ఏప్రిల్‌ 15
  2. ఐ హోస్టేజి (మూవీ)- ఏప్రిల్‌ 18

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *