ఉప్పల్ అభివృద్ధి BRS తోనే సాధ్యం!

ఉప్పల్ :కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు.

బుధవారం రామంతాపూర్ డివిజన్ పరిధిలోని సత్యా నగర్ లో కాలనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని తాను ఎల్లప్పుడు అందుబాటులో వుంటా అని కాలనీలో ప్రధాన సమస్య ఐనా డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు,కాలనీల అధ్యక్షులు సాగర్,రవీందర్ రెడ్డి,కృష్ణ రెడ్డి,సీతమ్మ,సుగుణ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share post:

Popular