ఉప్పల్​ అభివృద్ధి ఎన్​వీఎస్​ఎస్​దే

మన ఈనాడు:

డబ్బు సంచులు పంచే నాయకుడు తమకు వద్దని..ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్​(NVSS) కావాలని ఉప్పల్​ సర్కిల్​ కాషాయం నేతలు బైక్​ ర్యాలీ చేపట్టారు.
గడిచిన ఐదేళ్లుగా ఉప్పల్​ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అంటూ విమర్శలు చేశారు.

ఎన్నికల సమయంలో కాంట్రాక్టర్లు టిక్కెట్లు తెచ్చుకోని ప్రజల కోసం వచ్చామని మభ్యపెడతారని ఆరోపించారు. ఓటమి చెందాక మళ్లీ కనిపించరని ఎద్దేవా చేశారు. 1000 ద్విచక్ర వాహనాలతో భాజపా నాయకులు చేసిన ర్యాలీ ప్రజలంతా మళ్లీ ఎన్​వీఎస్​ఎస్​ రావాలని దీవెనలు అందించారు.
ఈ ర్యాలీ నిర్వహిస్తుండడంతో అడుగడుగునా ప్రజలు కార్యకర్తలు మహిళలు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కి నీరాజనాలు పలికారు, పిలిస్తే పలికే నాయకుడే కావాలని ప్రజలు నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగిస్తూ..తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కాంట్రాక్టర్లుగా ఉన్న వ్యక్తులు ఈరోజు డబ్బు సంచులతో వచ్చి ఏదో చేస్తామని ప్రజలను ప్రలోభ పెట్టి ఓడిపోగానే ప్రజాక్షేత్రంలో పత్తా లేకుండా వెళ్లిపోతారు అని అన్నారు.

బిజెపి పార్టీ అలాకాకుండా గెలిచిన గెలవకపోయినా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల యోగక్షేమాలు, ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు, ప్రజలను ప్రలోభాలలో మభ్య పెట్టే వ్యక్తులను నమ్మవద్దని అని అన్నారు. బిజెపి పార్టీతోనే ప్రజలకు మేలు జరుగుతుందని సమన్యాయం జరుగుతుందోనని అన్నారు. ప్రజలు కమలం గుర్తుకే అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. వారితోపాటు ర్యాలీలో పాల్గొన్నవారు హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ ,రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు ,హబ్సిగూడ డివిజన్ అధ్యక్షులు కక్కిరేణి హరీష్ , రామంతపూర్ డివిజన్ బి జె పి అధ్యక్షులు బండారు వెంకటరావు, , చిలుక నగర్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్, ఉప్పల్ అధ్యక్షులు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చింతోజు శ్రీనివాస్ చారి, వేములకొండ సోమశేఖర్ గౌడ్, సంజయ్ పటేల్ న్యాలకోండ సుమన్ రావు, మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, రావుల బాలకృష్ణ గౌడ్, రేవు నరసింహ కురుమ,హబ్సిగూడ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, రామంతపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంకూ రి కుమారస్వామి, ఉలుగొండ నారాయణదాసు,చిలుక నగర్ ప్రధాన కార్యదర్శులు, ఉప్పల్ ప్రధాన కార్యదర్శిలు,మహిళా అధ్యక్షురాలు తాళ్ల మంగా గౌడ్, రాగిడి లతారెడ్డి, అంబటి భాగ్యలక్ష్మి, తదితర నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది,

Share post:

లేటెస్ట్