ఉప్పల్ ప్రజలకు అండగా నిలుస్తా

ఉప్పల్ హిల్స్ లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో సాయి కుమార్ ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. షాక్ సర్క్యూట్ కారణంగా సాయి కుమార్ కుటుంబం పూర్తిగా రోడ్డుపాలయింది. డ్రైవర్ గా పనిచేసుకుంటూ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

మంగళవారం రాత్రి ఇంట్లో విద్యుత్ ప్రమాదం జరిగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న పరమేశ్వర్ రెడ్డి బాధితుడు సాయి కుమార్ కుటుంబానికి అన్ని రకాల సహాయాన్ని అందజేశారు.

 

సాయి కుమార్ ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో ఆ కుటుంబాన్ని పరమేశ్వర్ రెడ్డి ఆదుకున్నారు. సాయి కుమార్ కుటుంబం మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం సాయి కుమార్ కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలను అందజేయాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

కార్యక్రమంలో దుర్గం నవీన్ యాదవ్  ,గోవింద్ కుమార్ స్వామి ,రామ చందర్ ,మోకాల సంతోష్ రెడ్డి రవీందర్ ,గోవర్ధన్ ,ఎన్ శ్రీను ,మేడి గిరిబాబు  ,మేడి సతీష్ ,ఏ కృష్ణ యాదవ్ కాలనీవాసులు పాల్గొన్నారు

Share post:

Popular