Mad Square: ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘వచ్చార్రోయ్’ సాంగ్ వచ్చేసింది!

2023లో ‘మ్యాడ్(Mad)’ వచ్చిన మూవీ యూత్‌ని తెగ ఆకట్టుకుంది. నాన్‌స్టాప్ కామెడీతో నార్నె నితిన్(Narne Nitin), రామ్ నితిన్(Ram Nitin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan) ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా ఈ మూవీలోని ‘‘కళ్లా జోడు కాలేజీ పాప సూడు.. ఎల్లారెడ్డిగూడ కాడా ఆపి సూడు’’ అనే సాంగ్ ఓ ఊపు ఊపింది. దీంతో మ్యాడ్ సినిమా బాక్సాఫీస్(Box Office) వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా అదే టీమ్ నుంచి రాబోతోంది. దీనిని ‘‘మ్యాడ్ స్క్వేర్(Mad Square)’’ టైటిల్‌తో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Director Kalyan Shankar) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Mad Square teaser: Narne Nithin's film lives up to the hype, evokes  non-stop comedy

ఈనెల 28న థియేటర్లలోకి..

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 28న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్(Promotions) కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ మేరకు మంగళవారం (మార్చి 18) ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) మ్యూజిక్ అందించిన ‘‘వచ్చార్రోయ్.. మళ్లొచ్చార్రోయ్.. వీళ్లకు హారతి పట్టండ్రోయ్’’ అంటే సాగే పాటను విడదల చేయగా యూట్యూబ్‌(Youtube)లో దుమ్మురేపుతోంది. ఈ పాటలో నటులంతా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. కాగా తొలిపార్ట్‌లాగే కామెడీ కంటిన్యూ అయితే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవడం పక్కా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పాటను మీరూ చూసేయండి..

Related Posts

హైదరాబాద్ లో శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐఎస్ఐ మార్కు (ISI Mark) లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS Raids), హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి…

Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. రింగ్ చూపిస్తూ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని (Ram Pothineni) ఓ హీరోయిన్ తో డేటింగులో ఉన్నాడంటూ చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ మహేశ్ బాబు.పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘RAPO 22’…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *