
వైస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీ రిమాండ్‌ను పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియనుండటంతో పోలీసులు జైలు నుంచే వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు.
మూడ్రోజుల కస్టడీకి వంశీ
ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వంశీ రిమాండ్ (Vamsi Remand)ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు నేటి నుంచి వంశీని మూడు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకోనున్నారు. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయన్ను విచారించనున్నారు. కస్టడీలోకి తీసుకునేందుకు పటమట పోలీసులు ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్నారు. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరగనుంది.