
శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj) జీవిత కథతో ప్రేక్షకుల ముందుకువచ్చిన సినిమా ‘ఛావా (Chhaava)’. విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో నటించగా రష్మిక మందన్న శంభాజీ మహారాజ్ సతీమణి ఏసుబాయి పాత్రలో అలరించింది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఛావా మూవీ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
22 రోజుల్లో రూ.500 కోట్లు
అభిమానులు ఊహించినట్టుగానే ఛావా (Chhaava Collections) చిత్రం తాజాగా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరింది. 22 రోజుల్లోనే రూ.500 కోట్లు తన ఖాతాలో వేసుకున్నట్లు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పోస్ట్ పెట్టారు. ఒక హిస్టారికల్ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం బాలీవుడ్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తెలుగులో ఛావా రిలీజ్
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి తెలుగు (Chhaava Telugu Version) ప్రజలు కూడా ఈ చిత్రాన్ని చూడాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని పెత్త ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు బ్యానర్ గీతా ఆర్ట్స్ ఛావా తెలుగు వెర్షన్ ను మార్చి 7వ తేదీన రిలీజ్ చేసింది. తొలి రోజు తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
ఛావా తెలుగు వసూళ్లు
డబ్బింగ్ సినిమాయే అయినా రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ తెలిపింది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వంలో వచ్చిన ఛావా సినిమాలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక (Rashmika Mandanna) నటనకు విమర్శకు ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…