Pyramids: పిరమిడ్ నిర్మాణ రహస్యం.. ఏఐ వీడియో అదుర్స్!

Mana Enadu: పిరమిడ్‌(Pyramids) అంటే వెంటనే గుర్తుకు వచ్చే దేశం ఈజిప్ట్(Egypt). ప్రపంచంలో అత్యంత గొప్ప, అత్యున్నత సాంకేతిక(High technology) విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు చాలా స్పెషల్(Very Special). పైగా ఇవి ప్రపంచ వ్యాప్తంగా చాలా పేరొందాయి కూడా. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఈజిప్టు పిరమిడ్లు(Egypt Pyramids) కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే పొడవైన నైలు నది కూడా ఈ నగరం గుండానే ప్రవహిస్తుండటంతో ప్రపంచ పర్యాటకులకు(Tourists) ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రాచీన, మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రహస్యాలు దాగున్నాయి.

 ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే

అయితే క్రీ.పూ. 2886-2160 నాటి ఈ పిరమిడ్ల రహస్యాలను ఛేదించాలనే పరిశోధనలు(Research) కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కాలంలోనే ఎత్తైన పిరమిడ్లను ఎలా నిర్మించారని? అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇప్పటికీ వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్(Scientists, Research Scholars) తమ విలువైన సమయాన్ని ఇందుకోసం వెచ్చిస్తున్నారు. అయినా ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే ఇది ఎప్పటికీ అంతు చిక్కని రహస్యం(dark secret)గా మిగిలిపోతోంది. అయితే ఈజిప్టు పిరమిడ్లకు, నైలు నదికి మధ్య ఏదో లింక్ ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

 భారీ మహాకాయుల సాయంతో..

ఇదిలా ఉండగా ఈజిప్టులోని ఈ పిరమిడ్లను ఎలా కట్టారన్న మిస్టరీపై సోషల్ మీడియా(Social Media)లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒకవేళ భారీ మహాకాయుల సాయంతో ఈజిప్షియన్లు(Egyptians) ఆ పిరమిడ్లను నిర్మించి ఉంటే..? ఇదే ఆలోచనతో కొందరు ఓ AI వీడియోను రూపొందించి నెట్టింట పెట్టారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఆ వీడియో నిజంగానే పిరమిడ్లను నిర్మిస్తున్నప్పుడు తీసింది అంటే నమ్మేలా ఉంది. అందులో భారీ భారీ శరీరాకృతిలో ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తుకెళ్తూ పిరమిడ్లను నిర్మించారు. పైగా వారి ఎత్తు కూడా దాదాపు 10 అడుగులకుపైనే ఉన్నట్లు క్రియేట్ చేశారు. మీరూ ఈ వీడియో(Video)ను చూసేయండి.

Share post:

లేటెస్ట్