
ఇటీవల జరిగిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్(Retro Prerelease Event)లో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దాయాది పాకిస్థాన్(Pakistan) గురించి మాట్లాడుతూ ట్రైబల్స్(Tribals) లాగా కొట్టుకోవడం ఏంటి అని అన్నారు. దాంతో విజయ్ తమను అవమానించేలా కామెంట్స్ చేయడం దారుణమని ఆదివాసీ జేఏసీ(Adivasi JAC) నేతలు మండిపడ్డారు. గిరిజనుల చరిత్ర తెలిసినట్లు హేళన చేస్తూ మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు(Apologies) చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Tollywood actor Vijay Devarakonda was on Thursday, May 1 booked for likening the Pahalgam attacks to tribal wars in the past.
In a video circulating on social media, the actor said that the Pahalgam attack is a senseless move by Pakistan, “The attack by Pakistan is a senseless… pic.twitter.com/zliUIOPpGF
— The Siasat Daily (@TheSiasatDaily) May 2, 2025
ఈ క్రమంలో తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్(Telangana Tribals Association) అధ్యక్షుడు, న్యాయవాది కిషన్‌రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ తాజాగా క్లారిటీ(Clarity) ఇచ్చారు.
వారందరూ నా కుటుంబసభ్యులే..
ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశం కాదన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన వివరణ ఇస్తూ ఒక ప్రెస్‌నోట్(Press Note) విడుదల చేశారు. “రెట్రో మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్ కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చింది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నాకు గిరిజనులంటే అపారమైన గౌరవం ఉంది. వారిని అవమానించాలన్నది నా ఉద్దేశం కానే కాదు. నేను ట్రైబల్స్ అనే పదం వేరే సెన్స్‌లో వాడాను. నేను ఎప్పుడూ ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులే అని భావిస్తాను. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే సారీ. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం” అని ఆయన అందులో రాసుకొచ్చారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025