యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్(Kingdom)’ సినిమా రిలీజ్ డేట్(Release Date)ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదలైన హై-ఓక్టేన్ ప్రోమో(Promo) అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. గౌతమ్ తిన్ననూరి(Gautham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే(Bhagyasri borse), సత్యదేవ్(Satyadev) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

ఈసారి రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు మాస్ ఎంటర్ టైన్మెంట్ పక్కా
ప్రోమోలో తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, డ్రామాటిక్ కాన్‌ఫ్లిక్ట్‌లు, అద్భుతమైన విజువల్స్‌తో సినిమా ఒక భారీ స్పెక్టాకిల్‌గా ఉండనున్నట్లు సూచనలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం, జోమోన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉండనుంది. ఈ ప్రోమో సోషల్ మీడియా(Social Media)లో ట్రెండింగ్‌లో ఉంది, అభిమానులు విజయ్ రగ్గడ్ లుక్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. “ఒక మనిషి.. కోపంతో నిండిన హృదయం” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎమోషనల్ డెప్త్‌ను సూచిస్తోంది. ప్రోమోలో విజయ్ పోలీస్ కానిస్టేబుల్‌గా, జైలులో ఖైదీగా కూడా కనిపించడంతో ఇదేదో కొత్త స్టోరీలానే ఉంది అని తెలుస్తుంది. దీంతో ఈసారి రౌడీ బాయ్ ఫ్యాన్స్‌కు మాస్ ఎంటర్ టైన్మెంట్ పక్కాగా అందించనున్నట్లు తెలుస్తోంది. మీరూ రిలీజ్ ప్రోమో చూసేయండి..








