Virat Kohli: ఏం ఇన్నింగ్స్ భయ్యా.. విరాట్ విధ్వంసానికి రెండేళ్లు

Mana Enadu: 2022 అక్టోబర్ 23. ఈ తేదీని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) విధ్వంసం సృష్టించాడు. విరాట్ అద్భుత ఇన్నింగ్స్‌కు పాకిస్థాన్‌కు చుక్కలు కనిపించాయి. ఆ జట్టే కాదు. ఆ దేశస్థులూ అంత ఈజీగా మార్చిపోలేరు. పాకిస్థాన్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌(Haris Raoof) బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్స్(SIX) అందరీకీ గుర్తుకు ఉంటుంది.

 అసలు మ్యాచ్‌కి వచ్చే సరికి సీన్ రివర్స్

ఆస్ట్రేలియా గడ్డపై మెల్‌బోర్న్‌లో 2022 T20 ప్రపంచకప్‌ జరిగింది. ఈ మ్యాచులో టీమ్ఇండియా, పాకిస్థాన్(Ind vs Pak) జట్లు అక్టోబర్ 23న తలపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాల్లో ఒకటైన MCGలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు హరీస్ రవూఫ్ స్పీడ్‌పై పాకిస్థాన్ ఫుల్ జోక్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే పైచేయి అని పలువురు క్రికెట్ పండితులు కూడా అభిప్రాయపడ్డారు. కానీ, అసలు మ్యాచ్‌కి వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. పాక్ ప్లేయర్ల ముఖం మాడిపోయింది.

 ICC షాట్ ఆఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత 31 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. కానీ టీమ్‌ను కోహ్లీ దేవుడిలా ఆదుకున్నాడు. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. కోహ్లీ కొట్టిన ఈ సిక్స్‌లలో ఓ సిక్స్‌ను ఐసీసీ షాట్ ఆఫ్ ది సెంచరీ(ICC shot of the century)గా ప్రకటించింది. నేడు అక్టోబర్ 23 కావడంతో కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్(Super innings) తెగ ట్రెండ్(Trend) అవుతోంది. మీరూ ఆ వీడియో(Video) చూసేయండి.

 

Share post:

లేటెస్ట్