INS vs NZ: తొలిటెస్టులో నేడు కీలకం.. నిలుస్తారా? దాసోహం అవుతారా!

Mana Enadu: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్(Ind vs Nz) జట్ల తొలి టెస్టులో నేడు కీలకంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి టీమ్ఇండియా(Team India) ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయడంలో విఫలం అయింది. దీంతో న్యూజిలాండ్(New Zealand) 402 రన్స్ చేసింది. దీంతో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించింది. ఆ జట్టులో యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర(134) తన టెస్ట్ కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేయడం విశేషం. ఆ జట్టులో ఓపెనర్ డేవాన్ కాన్వె 191 పరుగులు చేయగా.. బౌలర్ టీమ్ సౌథీ(65) సైతం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ బాదడం మూడో రోజు ఆటకే హైలైట్‌.

 ఆ ముగ్గురు ఏం చేస్తారో..

ఇక తొలి టెస్టు(1st Test)లో భారత్ జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే రెండే దార్లు ఉన్నాయి. ఒకటి రెండో ఇన్నింగ్స్‌(Second Innings)లో కనీసం శనివారం మధ్యాహ్నం వరకు దూకుడుగా బ్యాటింగ్(Batting) చేసి 550 ప్లస్ స్కోరు చేయాలి లేదా ఈ రెండన్న రోజులు ఆలౌట్ కాకుండా వికెట్లు కాపాడుకోవాలి. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు పూర్తి ఒత్తిడిలో ఉండటంతో.. రెండూ కష్టంగానే కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికీ భారత్ 125 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే జైస్వాల్ (35), రోహిత్(52), కోహ్లీ(70) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నేటి ఆటలో సర్ఫ్‌రాజ్(70*) పంత్, కేఎల్ కీలకంగా మారనున్నారు.

 తేలిపోయిన టీమ్ఇండియా బౌలర్లు

టీమ్ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో కివీస్(Kiwis) కేవలం 31.2 ఓవర్లలోనే కుప్పకూల్చింది. దీంతో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోందని, మనోళ్లు కూడా అదే రేంజ్‌లో బౌలింగ్ చేస్తారని సగటు క్రికెట్ అభిమాని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయింది. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన పిచ్‌పై భారత బౌలర్లు తేలిపోయారు. దీంతో న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లకిగానీ ఆలౌట్ చేయలేకపోయారు. భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా(Jadeja), కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) చెరో మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్(Siraj) రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

Share post:

లేటెస్ట్