టాలీవుడ్(Tollywood)లో కార్మికుల వేతనాల పెంపు(Increase in workers wages) అంశంపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు(Film Chamber Representatives), ఫిల్మ్ ఫెడరేషన్(Film Federations)కు చెందిన ఏడు యూనియన్లతో మంగళవారం (ఆగస్టు 19) మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. చర్చల సమయంలో 9 టు 9 కాల్‌షీట్ విధానంపై కూడా ప్రస్తావన వచ్చింది. ఈ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఫెడరేషన్ నేతలను ఒప్పించేందుకు ఫిల్మ్ ఛాంబర్ యత్నించినట్టు సినీవర్గాలు పేర్కొన్నాయి.

ఈ రోజు సాయంత్రం అధికారిక ప్రకటన
ఇదిలా ఉండగా సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని(Film Federation President Anil Vallabhaneni) మీడియాతో మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు మా సమస్యలు గమనించారు. వేతనాల్లో శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. మూడు యూనియన్లకు కూడా వేతన పెంపు వర్తింపజేస్తామని తెలిపారు. బుధవారం (ఆగస్టు 20) ఉదయం నిర్మాత(Producers)లతో మరోసారి చర్చించి, సాయంత్రం అధికారిక ప్రకటన చేస్తారు’ అని వివరించారు. మరోవైపు చర్చల వివరాలను నటుడు చిరంజీవి(Megastar Chiranjeevi)కి ఫోన్ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ(Telangana)ను సినిమా హబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఫొటోకు పాలాభిషేకం చేశామని తెలిపారు. సినీ పరిశ్రమలో కార్మికుల హక్కులపై ఈ రోజు వెలువడే నిర్ణయం ఆసక్తిగా మారింది.






