
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోన్న మాట బర్డ్‌ఫ్లూ(Bird Flu). ఈ వైరస్(Virus)తో ఏకంగా చికెన్ దుకాణాలనే ఎత్తేసే పరిస్థితి నెలకొంది. కోళ్లకు వ్యాపించడంతో వేలాది సంఖ్యలో కోళ్లు మృత్యువాత(Chickens die) పడుతున్నాయి. దీంతో ప్రజలు చికెన్ తినాలంటేనే హడలిపోతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(Chicken Rates) సైతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ లవర్స్‌కు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా కానూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు చికెన్ దుకాణాలను మూసి వేయించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగు చూసిన ప్రాంతం నుంచి కిలోమీటర్ పరధిని అలర్ట్ జోన్(Alert Zone)గా ప్రకటించారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్(Surveillance Zone)గా ప్రకటించారు. వ్యాధి సోకిన కోళ్లను పూడ్చిపెట్టాలని ఆదేశించారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి కోళ్లను రాకుండా సరిహద్దులోనే నిలువరిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో కూడా కోళ్లు మరణించాయి. బర్డ్ ఫ్లూతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పశుసంవర్ధకశాఖ అధికారులు(Officials of Animal Husbandry Department) అలర్టయ్యారు.
అసలు బర్డ్‌ఫ్లూ అంటే ఏంటి?
బర్డ్‌ఫ్లూ వ్యాధికి H5N1 అనే వైరస్ కారణం. ఇది అంటువ్యాధి. పక్షులు, జంతువులతో పాటు మనుషులకు కూడా ఇది వ్యాపిస్తోంది. యూరప్(Europe), ఆసియా(Asia) దేశాల్లో తొలుత బాతుల్లో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే H5N1 వైరస్‌ను 1996లో చైనా(Chaina) గుర్తించింది. పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషిత ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన పక్షులు, జంతువులతో ఎక్కువ సమయం ఉన్న మనుషులకు కూడా ఇది వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఏపీలోని కోళ్లకు విస్తృతంగా వ్యాపిస్తోంది.