ISS: స్పేస్ సెంటర్‌ ఇలా ఉంటుందా! అక్కడ వ్యోమగాములు ఏం తింటారో తెలుసా?

ManaEnadu: ఓ వైపు భయం.. మరోవైపు ఏం కాదులే అన్న ధైర్యం. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు(Astronauts) సునితా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్ గురించి రోజుకో వార్త వింటుంటే భారతీయుల్లోనే కాదు,యావత్ ప్రపంచం కూడా వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వారికేం కాదని, అక్కడ భూమి ఉన్నట్లు తినడానికి, పడుకోవడానికి, ఉల్లాసానికి వివిధ వసతులు ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా సునితా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station)లో 8రోజులు ఉండేందుకు JUNE 5న బోయింగ్ స్టార్ లైనర్‌ స్పేస్ క్రాఫ్ట్‌(Boeing Star Liner spacecraft)లో అంతరిక్షానికి వెళ్లారు. కానీ వారిని తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య(Technical problem) ఏర్పడడంతో వారిద్దరూ 2025 వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

400 కిలోమీటర్ల ఎత్తులో
ఈ నేపథ్యంలో నాసా సైంటిస్టులు(NASA scientists) అక్కడి పరిస్థితుల గురించి వివరించారు. భూమికి 400KM ఎత్తులో ఈ కేంద్రం ఉంటుందన్నారు. అక్కడ వ్యోమగాములు చాలా త్వరగా నిద్రలేస్తారు. ISS మాడ్యుల్‌లో ఫోన్‌బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు వస్తారని, ప్రపంచంలో ఇదే అత్యుత్తమ స్లీపింగ్ బ్యాగ్ అని సైంటిస్టులు తెలిపారు. అంతేకాదు Space stationలోని కంపార్ట్‌మెంట్స్‌లో ల్యాప్‌టాప్‌లు కూడా ఉంటాయట. ఇవి సిబ్బంది తమ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు, చూసేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అక్కడ చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీరుగా మారుస్తారట. ISSలో నిర్వహణ, శాస్త్రీయ ప్రయోగాల పనులు ఎక్కువగా చేస్తుంటారని సైంటిస్టులు తెలిపారు.

అక్కడ కాళ్లు, చేతులు కదపలేం..
ISS కేంద్రం బకింగ్‌హామ్ ప్యాలెస్(Buckingham Palace) అంత సైజులో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్లు, చేతులు కదపలేం. అందుకే కండర క్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్టు అవుతుంది. భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి. కానీ స్పేస్‌లో మెటాలిక్ స్పేస్ స్మెల్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవు. స్పేస్ స్టేషన్‌లో ఎక్కువకాలం ఉండేవారు రోజు 2గంటల పాటు యంత్రాల సాయంతో వ్యాయామం చేయాలి. అక్కడి సిబ్బంది ట్రెడ్‌మిల్స్ కూడా ఉపయోగిస్తారు. ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్‌లో ఫుడ్ ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది. అక్కడ వ్యోమగాములు డైలీ 8గంటలు నిద్రపోతారని, చాలా మంది కిటికీ వద్దే ఉండి భూమిని చూస్తుంటారు అని సైంటిస్ట్ స్టాట్ చెప్పారు.

Related Posts

డోంట్ మ్యారీ బీ హ్యాపీ.. చైనా, రష్యాలో ‘పెళ్లిగోల’..

Mana Enadu: ఒక దేశంలోనేమో పెళ్లి జరగదు.. మరో దేశంలోనేమో కడుపు పండదు. పేరుకు ప్రపంచంలో రెండు అతిపెద్ద దేశాలు. కానీ అక్కడి యువత ఆ దేశాధినేతలకు తలనొప్పి తెప్పిస్తున్నారు. పెళ్లి (Marriage)కి నో అంటూ, పిల్లలంటే నోనోనోనో అంటున్నారు. ఫలితంగా…

చంద్రయాన్‌ 4, 5 డిజైన్లు కంప్లీట్.. త్వరలో గగన్‌యాన్‌ ప్రయోగం : ఇస్రో చీఫ్

ManaEnadu:చంద్రుడిపై అన్వేషణలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పలు ప్రయోగాలు చేపట్టి విజయవంతం అయిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 తో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు చంద్రుడిపై మరింత లోతుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *