కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘థగ్ లైఫ్’ సినిమాను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారని కమల్‌ను ప్రశ్నించింది. ‘క్షమాపణలు చెప్పాలని కోరితే చెప్పకుండా కోర్టుకు వచ్చారు. మీరు సామాన్య వ్యక్తి కాదు. ఇష్టానుసారం మాట్లాడటం సరైనది కాదు’ అని వ్యాఖ్యానించింది. మీరైమనా చరిత్రకారులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలేం జరిగిందంటే..
తమిళం భాష నుంచి కన్నడ పుట్టిందని థగ్ లైఫ్ ( thug life) ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేశాయి. కమల్ హాసన్ సినిమాని అడ్డుకుంటామని కన్నడ సంఘాలు ప్రకటించాయి. కమలహాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కమల్ సినిమా రిలీజ్ కావాలంటే కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని కన్నడ ఫిలిం అసోసియేషన్ ప్రకటించింది. లేకపోతే సినిమాను విడుదలను నిలిపివేస్తామని చెప్పింది.
కమల్ కు సపోర్టుగా చెన్నై లో పోస్టర్లు
కమలహాసన్ ఇప్పటికే కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు. సినిమా విడుదలను అడ్డుకోకుండా చూడాలని పిటిషన్ వేశాడు. తాను తప్పు చేయలేదని తాను ఒకవేళ తప్పు చేశాను అని అనిపిస్తే కచ్చితంగా సారీ చెబుతానని ప్రకటించాడు. ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నైలో కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం (makkkal nidhi mayyam) ఆధ్వర్యంలో భారీగా పోస్టర్లు వెలిశాయి. . ఇందులో ప్రపంచానికి తెలిసిన నిజమే కమలహాసన్ అన్నారు. ప్రేమతో సంబంధాలు మెరుగుపడతాయి. నిజం ఎప్పటికీ తలవంచొదు అని రాసి ఉన్నాయి.






