మెదక్ జిల్లాలో మంత్రి హరీష్‌రావు పెత్తనంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట మంత్రి హరీష్ అడ్రస్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేస్తున్నాని అన్నారు. రబ్బరు చెప్పులతో వచ్చిన హరీష్ అన్ని మరిచి పార్టీలో పెత్తన్నం చేస్తున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెదక్, మల్కాజిగిరిపై దృష్టి పెట్టానని తెలిపారు. హరీష్‌రావు దుకాణం సిద్దిపేట్లో దుకాణం బంద్ చేసి తన సత్తా ఎంటో చూపిస్తానని సంచలన విమర్శలు చేశారు.
గంటగంటకు పెరుగుతున్న టెన్షన్
బీఆర్ఎస్ టికెట్ల పంచాయితీ అధికారపార్టీలో గంటగంటకు టెన్షన్ పెరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్‌లతోపాటు ఆశావాహులు తమకే టికెట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రకటించే మొదటి జాబితాలో తమతోపాటు వారి అనుచరులకు చోటు లేకుండా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. గ్రేటర్లో పది నియోజకవర్గాల్లో టికెట్లు లోల్లి మొదలైంది. కేసీఆర్ నమ్ముకున్న లక్కినెంబరు 6 కాకుండా ఈసారి 3 నెంబరు వచ్చేలా ఉన్న తేదీన ఎన్నికల టికెట్లు తొలి జాబితా ప్రకటిస్తున్నారు. సీన్ రివర్స్ కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.