Sikkim: 12ఏళ్లుగా కడుపులోనే కత్తెర.. సిక్కింలో వైద్యుల నిర్లక్ష్యం

Mana Endau: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. సిక్కిం(Sikkim)లోని ఓ మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్(Appendix operation) జరిగ్గా ఆ సమయంలో డాక్టర్లు కత్తెరను కడుపు(Doctors scissors in the stomach)లోనే ఉంచి మరిచిపోయారు. అయితే తన సమస్యకు ఆపరేషన్(Operation) చేపించుకున్నా.. మళ్లీ నిత్యం కడుపునొప్పి(stomach pain) రావడం ఆమె ఇబ్బంది పడింది. ఈ క్రమంలో మరోసారి స్కానింగ్(Scanning) చేపించడంతో అసలు విషయం బయటపడింది.

 ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లినా..

వైద్యులు చేసిన నిర్లక్ష్యం(Medical Negligence) పని వల్ల ఓ మహిళ 12 ఏళ్లుగా నరకాన్ని అనుభవించింది. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల సదరు యువతి తీవ్రంగా క్షోభపడింది. ఈ సర్జరీ(Surgery) జరిగే సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె పొత్తి కడుపులోనే కత్తెరను వదిలేశారు. అయితే తన బాధను తీర్చమంటూ ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్లిన కూడా ఆమెకు పొత్తి కడుపులో నొప్పి మాత్రం తగ్గలేదు. చివరకు స్కానింగ్ చేయడంతో కడుపులో కత్తెర ఉన్నట్లు తెలిసింది. దీంతో మళ్లీ ఆపరేషన్ చేసి ఆ కత్తెరను బయటికి తీశారు.

 ఆసుపత్రిపై కేసు నమోదు

ఆ మహిళ 2012లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకుంది. గ్యాంగ్‌టక్‌(Gangtok)లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మోమరియల్(STNM) ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. ఈ సమయంలో ఆమె కడుపులో కత్తెర(scissors)ను వైద్యులు మర్చిపోయారు. అలా అప్పటి నుంచి ఈ కత్తెర కడుపులోనే ఉండిపోవడంతో ఆమె తీవ్ర నొప్పికి గురయ్యింది. ఈ విషయం బయటపడటంతో సదరు ఆసుపత్రిపై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు ఆ హాస్పిటల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share post:

లేటెస్ట్