
బీజేపీ అధిష్ఠానం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని దేశరాధానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా(Rekha Gupta) పేర్కొన్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెను ప్రకటించిన అనంతరం ఆమె స్పందించారు. కాగా. తొలిసారి షాలిమార్‌బాగ్(Shalimarbagh) నుంచి MLAగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా CM కానున్నారు. గతంలో BJP నుంచి సుష్మా స్వరాజ్(Sushma Swaraj), కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్(Sheila Deekshit, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశీ(Athishi) ముఖ్యమంత్రులుగా పని చేశారు. కాగా తనను CMగా ఎంపిక చేసిన అగ్రనాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
#WATCH | Delhi CM designate Rekha Gupta says, “It is a huge responsibility. I thank PM Modi and BJP high command for having faith in me… I will fulfil my responsibility with utmost honesty… My first priority is to complete all the commitments our party has made, and the… pic.twitter.com/kkGVAL7nq5
— ANI (@ANI) February 20, 2025
అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెడతా: రేఖా గుప్తా
తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్ఠానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అధిష్ఠానం నమ్మకం, మద్దతు తనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయని రాసుకొచ్చారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా రేఖా గుప్తాకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నాయకురాలు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ అభినందనలు తెలిపారు.
ఈ మధ్యాహ్నాం 12.35 గంటలకు ప్రమాణం
కాగా ఇవాళ సీఎంగా రేఖా గుప్తా సహా 6 మంత్రులతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మధ్యాహ్నం 12.35గంటలకు సీఎంగా రేఖాగా గుప్తా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు రామ్‌లీలా మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), అమిత్ షా, BJP అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, NDA ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుక కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.