జైలులో వల్లభనేని వంశీకి వైఎస్ జగన్‌ పరామర్శ

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడలో పర్యటించారు. జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. నేటి ములాఖత్‌లో వంశీని కలిశారు. కిడ్నాప్‌ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ములాఖత్‌ జగన్ వంశీని కలిసి పరామర్శించారు. అయితే పేర్ని నాని, కొడాలి నాని (Kodali Nani)కి ములాఖత్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.

జైలులో వంశీ (Vallabhaneni Vamsi)ని పరామర్శించిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ పై తప్పుడు కేసు పెట్టారని ఆయన అన్నారు.  టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారని.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని విమర్శించారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. చంద్రబాబు (AP CM Chandrababu Naidu) కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారని జగన్ పేర్కొన్నారు.

“పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి (TDP Office Attack) చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభి, ఆయన అనుచరులు ఓ దళిత నేత పై దాడి చేశారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారు. మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. సత్య వర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడట.. ఎవ్వడో చూశారట.. డబ్బు లాక్కొని పోయాడని తప్పుడు కేసు పెట్టించారు.” అని జగన్ అన్నారు.

Related Posts

KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’

‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోతాం.. డీలిమిటేషన్‌పై సీఎం స్టాలిన్

జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin) అన్నారు. దీనివల్ల సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *