Pulivendula ZPTC by Poll: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఆ కేంద్రాల్లో రీపోలింగ్

కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల(Pulivendula ZPTC by Poll) సందర్భంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(Re-Polling) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) నిర్ణయించింది. ఆగస్టు 12న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్లు, ఓటర్లను అడ్డుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో, SEC రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈమేరకు పులివెందులలోని రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. 3, 14 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అచ్చువేల్లి, కొత్తపల్లి గ్రామాల్లో

పులివెందుల మండలంలోని అచ్చువేల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ రీపోలింగ్ జరిగింది. ఈ రెండు కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు ఓటర్లను బెదిరించి, వైసీపీ ఏజెంట్లను బూత్‌ల నుంచి బయటకు పంపించారని, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నుంచి బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారని వైసీపీ ఆరోపించింది. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, తనను కూడా ఓటు వేయకుండా అడ్డుకున్నారని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం 7 గంటల నుంచి రీపోలింగ్

ఈ మేరకు రీపోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో జరిగింది. శాంతిభద్రతల కోసం 600 మంది పోలీసులను మోహరించారు. వెబ్‌కాస్టింగ్, డ్రోన్లు, మొబైల్ సర్వైలెన్స్‌తో నిఘా పెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్‌తో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాగా పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, మారెడ్డి లతారెడ్డి, హేమంత్‌రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *