Mana Enadu : మందు బాబులకు కిక్కిచ్చే న్యూస్ చెప్పాయి లిక్కర్ కంపెనీలు. తాజాగా భారీగా మద్యం ధరలు (Liquor Prices) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్‌ను తగ్గించడంతో ఆయా కంపెనీల నుంచి ఏపీ బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గడంతో మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే లిక్కర్ ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకురాగా.. వాటి ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ (Telangana Excise Department) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తగ్గించిన ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయిస్తుండగా.. కొత్తగా వచ్చే వాటిని మాత్రం తగ్గిన ధరల ప్రకారం అమ్ముతారు.
ఏయే మద్యం బ్రాండ్ల ధరలు తగ్గాయంటే..?
- మాన్షన్ హౌస్ (Mansion House Price) క్వార్టర్ ధర గతంలో రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కు తగ్గించారు.
- రాయల్ చాలెంజ్ (Royal Challenge Wiskhy) సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కు.. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
- యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 ఉండగా.. రూ.1400కు తగ్గించారు.






