“మద్యం సేవించడం (Drinking Alcohol) ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం” అని ఎక్కడ చూసినా సైన్ బోర్డులు, వార్నింగులు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉంటాయి. అయినా చాలా మంది మందుబాబులకు ఇది ఓ పట్టాన అర్థంకాదు. ఇక కొందరేమో మేం తాగేది బీర్ మాత్రమే.. అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ (Alcohol Percentage) తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఏం కాదంటూ సర్దిచెప్పుకుంటారు. అయితే అతిగా బీరు తాగడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మితంగా తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. బీరు తాగే వారు దాని గురించి ఈ 6 విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందేనని అంటున్నారు.
బీరు (Beer) తాగేవారు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే..
మితంగా బీరు తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది
గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది
కిడ్నీల్లో రాళ్లు రావట
పోషకాలు అనేకంగా ఉంటాయి
అతిగా బీరు తాగడం వల్ల బరువు పెరుగుతారు
ఎక్కువగా బీరు తాగడం వల్ల దానికి బానిసగా మారే ప్రమాదం ఉంది
బీరు గుండె ఆరోగ్యానికి (Heart Health) మంచిదట
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. మహిళలు 5 శాతం ఆల్కహాల్‌తో రోజుకు 330 మిల్లీలీటర్లు, పురుషులు 660 మిల్లీ లీటర్ల వరకు తాగొచ్చట. ఇలా మితంగా తాగితే పాలీపినోల్స్, విటమిన్లు, అమైనో యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి కృషి చేస్తాయని నిపుణులు అంటున్నారు. మరోవైపు సరైన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందని Indian Journal Of Medical Research అధ్యయనం తేల్చింది. బీర్ లో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే సిలికాన్ అధికంగా ఉంటుందని రీసెర్చులో బయటపడింది.
బీరుతో కిడ్నీలో రాళ్లు మాయం
మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) వచ్చే అవకాశాన్ని బీర్ తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక నీరు ఉండడం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగి.. శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతాయని తెలిపారు. బీర్ (Vitamins in Beer)లో శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, బీ విటమిన్లు సహా అనేక పోషక గుణాలు ఉన్నాయట. ఇందులో బీ 1, బీ 2, బీ 6, బీ 9, బీ 12 విటమిన్లతో పాటు మెగ్నీషియం, పోటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయట.
అతిగా తాగడం వల్ల ఎన్నో దుష్ప్రయోజనాలు
బీర్ అధికంగా తాగడం వల్ల బరువు (Weight Gain With Beer) పెరుగుతారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మితంగా తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అతిగా తాగడం వల్ల అంతకంటే రెట్లు దుష్ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బీరు ఎక్కువగా తాగడం వల్ల బాగా అలవాటై.. క్రమంగా మద్యానికి బానిస (Alcohol Addiction)గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఫలితంగా దాని ప్రభావం మానవ సంబంధాలు, ఆర్థికక విషయాలపై పడుతుందని చెబుతున్నారు.








