అడివి శేష్ (Adivi sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధానపాత్రలో నటిస్తోన్న మూవీ ‘డెకాయిట్’(Dacoit). షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మూవీ ఫైర్ గ్లింప్స్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది (Dacoit Fire Glimpse). సినిమాలో మృణాల్ ఠాకూర్ జూలియట్ అనే పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మృణాల్తో అడవి శేష్ చెప్పే మాటలు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఫైర్ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి.






