Telangana: భాజపాతో జనసేన పొత్తు ఫిక్స్

 


మన ఈనాడు:

తెలంగాణ ఎన్నికల క్రమంలో(TS Elections 2023) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ నెల 27న రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అదేరోజు సూర్యాపేట జిల్లాలో నిర్వహించే భాజపా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు చేసేందుకు భాజపా నాయకులు సిద్ధం అవుతున్నారు. లక్ష మందితో సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు పార్టీని వీడతారంటూ సాగుతున్న ప్రచారంపై భాజపా అలర్ట్ అయినట్లు తెలుస్తుంది.

సూర్యాపేట సభ తర్వాత అసంతృప్త నాయకులతో అమిత్ షా స్వయంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నేతల సందేహాలను అమిత్‌ షా నివృత్తి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా మీటింగ్ తర్వాత తెలంగాణలో BJP కొత్త ఊపు వస్తుందని.. వలసలకు చెక్ పడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 27న అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ పొత్తులపై ఈ ఇరువురు నేతల నడుమ చర్చ జరగనున్నట్లు సమాచారం. తమకు 20 సీట్లు కేటాయించాలని తెలంగాణ జనసేన పార్టీ నేతలు కోరుతుండగా.. 8-10 సీట్లు ఇస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో పవన్ కల్యాణ్‌ భేటీలో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ వారంలోనే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 మందితో రెండో జాబితా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *