జబర్దస్త్ షో యాంకరింగ్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న నటి అనసూయ (Anasuya). ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించింది. రంగస్థలం(Rangasthalam), పుష్ప(Pushpa) వంటి సినిమాల్లో నటించగా.. బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఒక్కసారిగా అనసూయ రేంజ్ మారిపోయింది. ఇక బుల్లితెరకు దూరం అయిన అనసూయ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, అనసూయ ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ కీలక నోట్(Note) విడుదల చేసింది. తనపై కొందరు తప్పుడు వీడియోల(Fake videos)ను సృష్టించి నెట్టింట వైరల్ చేస్తున్నారని అలా చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చింది.

‘‘నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా గడిపినా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఛానెల్‌లు నన్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని మరీ వీడియోలు సృష్టిస్తున్నారు. వారు ఎవరో నాకు తెలియదు. నేను వాళ్లకు తెలియదు. అయినప్పటికీ వారు నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు’ అని మండిపడింది.
‘‘అవును నేను ఓ స్త్రీని, భార్యను తల్లిని. అయినా నాకు నచ్చిన దుస్తులు(Dressing Style) ధరిస్తున్నాను. తల్లి అయితే గ్లామరస్‌గా ఉండకూడదని లేదు కదా. నా కుటుంబం, నా భర్త, పిల్లలు నాకు సపోర్ట్(Support)గా ఉంటారు. కొందరు దాన్ని సహించలేకపోతున్నారు. నా పిల్లలు నమ్మకంగా, దయగా, గౌరవంగా ఉంటారు. పట్టుదలగా ఉండడం అంటే అగౌరవంగా ఉండడం కాదు. నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరించడం నా విలువలను కోల్పోవడం కాదు. నన్ను అనుసరించమని నేను ఎవరినీ అడగడం లేదు’’ అని నోట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram








