రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్డమ్’ (Kingdom) మూవీతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మే 30న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజెంట్ ‘కింగ్డమ్’ పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్. ఇక ఈ మూవీ అనంతరం ఈ రౌడీ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ (Solid project) చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విజయ్, రాహుల్ కాంబోలో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా హిట్ అందుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025
రష్మిక రిప్లైతో క్లారిటీ..
అయితే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా నటిస్తున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ మూవీ టీమ్ హింట్ కూడా ఇచ్చేశారు. ఈ మేరకు మొదట మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ X వేదికగా రష్మికను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక కూడా.. యస్ గాయ్స్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఈ హింట్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబో మరోసారి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇవ్వలేదు.







