Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘ఘాటి’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

అనుష్క శెట్టి(Anushka Shetty), విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఘాటీ(Ghaati). జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా(Postponed release) పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నవంబరులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలొస్తున్నాయి. VFX వర్క్, మరింత శ్రద్ధ పెట్టి, మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం ప్లాన్ చేస్తోంది. నవంబరులో అయితే మరిన్ని థియేటర్స్ కూడా దొరకుతాయని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని కూడా చిత్రయూనిట్ ఆలో చిస్తోందట. అయితే ఈ విషయంపై అధి కారిక సమాచారం అందాల్సి ఉంది.

Anushka Shetty Ghaati release gets postponed again producers issue statement - India Today

పాస్-ఇండియా స్థాయిలో రిలీజ్

కాగా ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాస్ ఇండియా(Pan-India) స్థాయిలో రిలీజ్ కానుంది. ఒకప్పుడు అమాయకురాలైన మహిళ అనుకోని పరిస్థితులు, చేదు అనుభవాల కారణంగా ఎలా ఒక క్రూరమైన గంజాయి స్మగ్లింగ్(Ganja Smuggling)రాణిగా మారిందనేది ఈ సినిమా కథాంశం. “విక్టిమ్, క్రిమినల్, లెజెండ్” అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ సినిమాకు సౌత్ ఇండియాలో రికార్డు ధరగా చెబుతున్నారు. అనుష్క “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *