Tirupati Incident: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఘటన జరిగింది: YS Jagan

తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati stampede incident) రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని YCP అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) అన్నారు. తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రి(Tirupati Swims Hospital)లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా(Media)తో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సమయంలో ప్రతి ఏటా భద్రత కల్పిస్తారు. కానీ ఈసారి మాత్రం భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని అలాగే క్షతగాత్రులకు ఉచిత వైద్యం(Free medical care) తోపాటు రూ.5లక్షల పరిహారం(Compensation) ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.

అధికారులు, ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలి

అంతేకాగు ఈ ఘటనకు TTD అధికారుల నుంచి, ప్రభుత్వ పెద్దలంతా ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. వందలాది మంది భక్తులు వస్తారన్న తెలిసికూడా భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆరుగురు చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయన్నారు. తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇంత దారుణంగా వ్యవస్థ మారిపోయిందని జగన్ ధ్వజమెత్తారు. TTD, పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా, Q లైన్లలో నిలబెట్టకుండా, ఒకేచోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే BNS 105(ఉద్దేశపూర్వకంగా మృతికి కారకులు) బదులు తీవ్రత తక్కువగా ఉండే BNS 194 సెక్షన్‌తో కేసులు పెట్టడం దారుణమన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *