హీరో విజయ్ దేవరకొండపై (Vijay Deverakonda) కేసు నమోదైంది. గిరిజనులను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈమేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసు నమోదు చేశారు (Case On Vijay Deverakonda). దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
An SC/ST Atrocity case was filed against Vijay Deverakonda on May 3, 2025, at SR Nagar Police Station, Hyderabad, per reports. The case stems from remarks made on April 26, 2025, at a film event, where he allegedly compared the Pahalgam terror attack to tribal clashes, deemed…
— Grok (@grok) June 22, 2025






