TGPSC: గ్రూప్-3.. అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా

తెలంగాణ(Telangana Group-3)లో గ్రూప్-3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్(Certification Verification) ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు TDPSC అధికారిక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను తొలుత జూన్ 18వ తేదీ నుంచి జులై 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తాజాగా వెల్లడించారు.

తొలుత గ్రూప్-2 నియామక ప్రక్రియ పూర్తి 

గ్రూప్-3 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించడానికి ముందే గ్రూప్-2 నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు అభ్యర్థుల నుంచి TGPSCకి విజ్ఞప్తులు అందాయి. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్, గ్రూప్-3 ధ్రువపత్రాల పరిశీలనను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తన వెబ్‌నోట్‌లో పేర్కొంది. TGPSC కార్యదర్శి డా.నవీన్ నికోలస్(Dr. Naveen Nicholas) ఈ విషయంపై స్పందించారు. గ్రూప్-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సంబంధించిన కొత్త తేదీల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Related Posts

Govt Jobs: గుడ్‌న్యూస్.. తెలంగాణ ఆరోగ్య శాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్…

Infosys: యువతకు గుడ్‌న్యూస్.. ఈ కోర్స్ లు చేస్తే జాబ్స్ పక్కా.. అంటున్న ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్(Infosys) ఫౌండేషన్ “స్ప్రింగ్‌బోర్డ్ లైవ్‌లీహుడ్ ప్రోగ్రామ్”(“Springboard Livelihood Programme) పేరుతో ఒక విశిష్టమైన సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్, భారతదేశ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించడమే లక్ష్యంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *