జమ్మూకశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack)లో 26 మంది ప్రాణాలను కోల్పోయిన భారత్.. ఈ దాడి ఘటనలో బయటి దేశం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు(Investigation)లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్(Pakistan)పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (Cabinet Committee on Security) ఈ మేరకు కీలక చర్యలకు ఆమోదం తెలిపింది.

సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత
భారత్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty) తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని(Cross-border terrorism) పాకిస్థాన్ శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Foreign Secretary Vikram Misri) స్పష్టం చేశారు. అలాగే అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్(Attari-Wagah Integrated Check Post)ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే అనుమతులతో సరిహద్దు దాటిన వారు మే 1వ తేదీలోగా తమ దేశానికి వెళ్లవచ్చని సూచించారు.
వారంతా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలి
సార్క్ వీసా(SAARC Visa) మినహాయింపు పథకం (SVES) కింద పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ Visaపై భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంకా, న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని నేవల్, ఎయిర్ అడ్వైజర్ల(Naval and Air Advisors)ను ‘పర్సన నాన్ గ్రాటా’ (Unwanted people)గా ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇరు దేశాల హైకమిషన్లలోని మొత్తం సిబ్బంది సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించనున్నారు. ఈ తగ్గింపు ప్రక్రియ మే 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, “Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/PxEPrrK1G8
— ANI (@ANI) April 23, 2025








